ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఢిల్లీలో నిరసనల కారణంగా మెట్రో స్టేషన్లు మూసివేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.

ఇల్లెందులోని మార్ట్‌లో వస్తువులు దొంగిలించిన ఉపాధ్యాయుడు

ఇల్లెందులోని ఒక మార్ట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బిల్లు చెల్లించకుండా వస్తువులను తీసుకెళ్లేందుకు యత్నించగా, సీసీటీవీ విజువల్స్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

పుల్లెంల గ్రామంలో విద్యుత్ షాక్‌తో బోరు బావి మెకానిక్ మృతి

చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో బోరు మోటార్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి షేక్ సయ్యద్ అనే మెకానిక్ మృతి చెందారు.

సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ప్రధాని మోడీ పేరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాసిన లేఖలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.

చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసిన భార్య

మహారాష్ట్రలోని ఠాణెలో చీరల కోసం జరిగిన గొడవలో భార్య తన భర్తను హతమార్చింది. నిందితురాలు సునీతాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాచిగూడలో లాడ్జింగ్‌లపై పెరుగుతున్న ఆరోపణలు

కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.