మన పత్రిక, కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో బ్యాటరీ పేలి 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నికార్డి లోకేష్ అనే బాలుడు బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం అతని ప్రాణాలను బలిగొంది.
బాలుడు ఆడుకుంటున్న సమయంలో గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరకడంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో బాలుడి ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. ఈ ప్రాంతంలో పాత మొబైల్, ల్యాప్‌టాప్ బ్యాటరీల నుంచి కాపర్, స్క్రాప్ సేకరించి విక్రయించే అక్రమ వ్యాపారులు ఉన్నారని, బాలుడు పడేసిన బ్యాటరీని తెచ్చుకొని ఆడుకుంటుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పాత ఫోన్లు, ఉబ్బిన బ్యాటరీలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని అధికారులు ప్రజలను కోరారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
