ఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి వివాదం.. ఏడుగురి అరెస్ట్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (వర్ధరాజపూర్) పసుపు నీళ్ల శుద్ధి ఘటనపై విచారణ వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను వెలికితీసేందుకు అధికారులు సిట్‌‌ను రంగంలోకి దించారు. దీంతో దర్యాప్తు ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో లోతైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వర్ధరాజపూర్‌లో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా … Read more

పెద్దపల్లి: గంటల వ్యవధిలో దంపతుల మృతి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు అజయ్‌ (28), ఆయన భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చి వకీల్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటూ ఈ దంపతులు జీవిస్తున్నారు. సోమవారం వారికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తోటి కూలీలకు తెలిపారు. వెంటనే వారిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అజయ్‌ మృతి చెందాడు. ఆస్పత్రిలో … Read more

నల్గొండ జిల్లాలో విషాదం.. గణేష్ మండపంలో పూజారి మృతి

వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ (నాగార్జునసాగర్) మండపంలో పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందారు. సోమవారం చింతలపాలెంలోని రామాలయం వద్ద గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య వచ్చి తమ మండపం వద్దే ముందు పూజ చేయాలని గొడవకు దిగారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పి, రవి మండపం వద్దకు పూజారిని తీసుకెళ్లారు. … Read more

నేడు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న పలుచోట్ల కుండపోత వర్షాలు కురవగా.. నేడూ వానలు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో పగటిపూట ఉక్కపోత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారుతుంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో చెదురుమదురు తుఫాను ముప్పు పొంచి ఉంది. రాజధాని … Read more

వరంగల్: భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య

భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రేటర్‌ వరంగల్‌ నగరం 16వ డివిజన్‌ ధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు మరియు మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్‌ బిష్యాన్‌కు, తన మేనకోడలు మిల్లీ బిస్వాస్‌(21)తో ఈ ఏడాది జూన్‌ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు వరంగల్‌కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారంలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అయితే … Read more

TRSలో జోరు.. మరో 18 స్థానాలకు ఇన్‌ఛార్జుల ప్రకటన

తెలంగాణ రక్షణ సేనలో నియామకాల పర్వం జోరుగా సాగుతోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జులను అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. దీంతో పాటు మెదక్ లోక్‌సభతో పాటు వివిధ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను నియమించారు. ఇప్పటికే 42 స్థానాలకు బాధ్యులను ప్రకటించిన కవిత, తాజా జాబితాతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల నియామకాలను పూర్తి చేశారు. అలాగే 9 జిల్లాలకు అధ్యక్షులు, 3 … Read more

తెలంగాణలో నేడు భారీ వానలు, హైదరాబాద్‌లోనూ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక భాగ్యనగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లేవారు … Read more

రాష్ట్ర ప్రజలకు సీఎం, కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్‌ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అలాగే, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం మళ్లీ గాడినపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని ఏకదంతుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రజలంతా … Read more

కామారెడ్డి జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

TG CRIME: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళను దివ్యవాణిగా గుర్తించారు. కాగా, రెండు రోజుల క్రితమే దివ్యవాణి కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి మధుసూదన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు … Read more

పంచముఖ సంకటహర మహా గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 72వ ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండ్రోజుల క్రితమే విగ్రహ ఏర్పాటు పూర్తికాగా, ఉత్సవ కమిటీ గణేషుడి ఆగమనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి ఏకంగా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి కొలువుదీరాడు. వినాయకచవితి పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య పూర్తిగా సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ఘనంగా జరగనుంది. ఆ … Read more