మన పత్రిక, రాజేంద్రనగర్: జీవితంపై మనస్థాపం చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, అస్సాంకు చెందిన ప్రశాంత్ (29) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం వలస వచ్చి బండ్లగూడ జాగీర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు.
ప్రశాంత్ తన భార్యతో ఫోన్ లో గొడవపడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు గత కొంత కాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ప్రశాంత్, బుధవారం అపార్ట్ మెంట్ లోని ఒక సజ్జకు ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
