పశ్చిమ గోదావరి: పెళ్లైన మరుసటి రోజే పెళ్లి కొడుకు మృతి

AP CRIME: ఆ ఇంట్లో వివాహం జరిగి 24 గంటలు కూడా గడవలేదు.. పెళ్లికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. బంధువులను బస్సు ఎక్కించి తిరిగొస్తుండగా అంబులెన్స్ ఢీకొని నవవరుడు, అతని స్నేహితుడు దుర్మరణం చెందిన ఘటన పెరవలి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్టల వేమవరానికి చెందిన నేలపూడి ప్రదీప్‌(24)కు అదే గ్రామానికి చెందిన యువతితో … Read more

వికారాబాద్: కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు

TG CRIME: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్ర దుర్వాసన రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళగా గుర్తించారు. అయితే మృతదేహాల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు దొరకలేదని పోలీసులు తెలిపారు. అలాగే మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో … Read more

మహబూబాబాద్‌: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య సూసైడ్

మహబూబాబాద్‌ క్రైం: భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల(20)కు, మహబూబాబాద్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల.. పాప ఏడుస్తుండటంతో భర్తతో మాట్లాడించేందుకు ఈ … Read more

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. SUICIDE NOTE

హైదరాబాద్: “అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తాను తప్పు చేశానని, దానికి చావే శిక్ష అని లేఖలో పేర్కొన్న ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను సకాలంలో కాపాడారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈశ్వర్ సాయి అనే వ్యక్తి మోసం చేశాడని మాధురి … Read more

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి … Read more

ఆదిలాబాద్‌లో విద్యార్థి సూసైడ్

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంతో అనే అభ్యర్థి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టిఫిన్ చేద్దామని స్నేహితులు పిలిచారు. తర్వాత వస్తానని చెప్పి అనంతరం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా ఆయన ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. కుటుంబ కారణాల వల్లే స్వామిరామం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు … Read more

సిద్దిపేట: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి SUICIDE

TG: సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన ఆకుబత్తిని పవన్ (30) ఏడేళ్లుగా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు వచ్చిన అతను, ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని … Read more

హైదరాబాద్: రాంనగర్ గణేశ్ ఆగమన్‌లో విషాదం

హైదరాబాద్: రాంనగర్‌ వినాయకుని ఆగమన ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకుంది. శనివారం రాత్రి VST నుంచి రాంనగర్‌ చౌరస్తా వరకు భారీ డీజే శబ్దాల నడుమ యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బద్రినాథ్ అనే యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్‌ ద్వారా అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. … Read more

భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు దుర్మరణం

కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.

పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు

యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలపై పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్‌పై కేసు నమోదైంది.