నర్సాపూర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

నర్సాపూర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న మేతిపోలే శివశంకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం తన అవయవాలను దానం చేయాలని అతను సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా పలాసలోని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును విచారించిన మెజిస్ట్రీరియల్ టీమ్

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును మెజిస్ట్రీరియల్ టీమ్ విచారించింది. కేసు విచారణ కొనసాగుతోంది.

లలిత్ మోదీకి ఊరట ఫెమా కేసును కొట్టేసిన ట్రిబ్యునల్

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై ఉన్న ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసును అప్పీలేటు ట్రిబ్యునల్ కొట్టేసింది. ఈ తీర్పుతో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలిగింది.

మహబూబాబాద్‌లో రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని కాపాడిన పోలీసులు

మహబూబాబాద్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధపడిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. మణుగూరు ఎక్స్‌ప్రెస్ వస్తుండగా అతడిని సురక్షితంగా రక్షించారు.

ఏపీలో తల్లికి వందనం నిధులు విడుదల, తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేస్తున్నారు.