Advertisement

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును విచారించిన మెజిస్ట్రీరియల్ టీమ్

మన పత్రిక: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, జైలుకు చేరుకున్న మెజిస్ట్రీరియల్ టీమ్, నాగరాజును మూడు గంటల పాటు విచారించింది. లాకప్ డెత్ ఘటనకు సంబంధించి పలు వివరాలను ఆ బృందం సేకరించినట్లు తెలుస్తోంది.

కోర్టులో పిటిషన్ దాఖలు

మరోవైపు, ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ సీపీ మరియు ఏసీపీలను నిందితులుగా చేర్చాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ, ఇది ప్రైవేటు పిటిషన్ అని, దీనిని తిరస్కరించాలని కోరారు. అయితే, పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, సిట్ విచారణ పారదర్శకంగా జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. గత తీర్పును ఆధారంగా చేసుకునే ఈ పిటిషన్ వేశామని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement
Advertisement