మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ (Talliki Vandanam) పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిధులను జమ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున చేరుతుండగా, ఈ ఆర్థిక సహాయ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది.
పథకం వివరాలు
గతంలో ఉన్న నిబంధనలకు భిన్నంగా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం ప్రయోజనాలను అందిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పిల్లలే మన సంపద అని, వారి చదువులే తరగని ఆస్తి అని పేర్కొన్న మంత్రి నారా లోకేష్, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికీ తన వందనాలు తెలియజేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
