Advertisement

లలిత్ మోదీకి ఊరట ఫెమా కేసును కొట్టేసిన ట్రిబ్యునల్

మన పత్రిక: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీకి అప్పీలేటు ట్రిబ్యునల్ (SAFEMA) నుంచి భారీ ఊరట లభించింది. 2009లో సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించి ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన కేసును, విధించిన జరిమానాలను ట్రిబ్యునల్ కొట్టేసింది. లలిత్ మోదీపై మోపిన అభియోగాల్లో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని, ఆ వ్యవహారంలో ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి తప్పులు చేయలేదని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది.

స్వదేశానికి తిరిగి రానున్న లలిత్ మోదీ

ట్రిబ్యునల్ తీర్పుపై స్పందించిన లలిత్ మోదీ, గత 16 ఏళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందని, తన నిజాయితీ నిరూపితమైందని తెలిపారు. తాను ఎప్పుడూ భారత క్రికెట్ శ్రేయస్సు కోసమే పనిచేశానని పేర్కొన్నారు. 2010లో వివాదాల నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన ఆయన, ఈ తీర్పు తర్వాత ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. అక్టోబర్‌లో తన కుమార్తెకు సంతానం కలగబోతోందని, ఆ తర్వాత స్వదేశానికి రానున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement