Advertisement

బ్యాటరీ పేలి పదిహేనేళ్ల బాలుడు మృతి

మన పత్రిక, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చింతలమానపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పదిహేనేళ్ల నికార్డి లోకేష్ బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరకడంతో అది ఒక్కసారిగా పేలింది.

ఈ ప్రమాదంలో బాలుడి ముఖం మరియు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే లోకేష్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆడుకుంటూ కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
Advertisement