ఖైరతాబాద్‌లో 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో వినాయకచవితి సందడి మొదలైంది. గణేష్ ఆగామన్ ఉత్సవాలతో కోలాహలంగా మారిన భాగ్యనగరంలో అసలైన పండుగ శోభ సంతరించుకోనుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి … Read more