యూట్యూబర్‌ రమానందనకు మరోసారి నోటీసులు

అద్దంకి: యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కన్సల్టెన్సీ ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న జె.మోహనరావును 2023లో సంప్రదించారు. ఈ క్రమంలో మొదట అడ్వాన్స్‌గా రూ.లక్ష, పత్రాల పరిశీలన పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు కలిపి … Read more

రెండో శనివారం కారణంతో నేడు బ్యాంకులు బంద్

నెలలోని రెండో శనివారం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ప్రత్యక్ష సేవల కోసం మళ్లీ పనిదినాల్లోనే శాఖలను సంప్రదించాల్సి ఉంటుంది.

వర్ష సూచన.. 18 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని స్పష్టం చేసింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు … Read more

‘ది పారడైజ్’ ట్రైలర్ విడుదల చేయకపోవడానికి కారణం చెప్పిన నాని

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రానికి ట్రైలర్ విడుదల చేయడం లేదని, సినిమాను నేరుగా థియేటర్లలోనే వీక్షించాలని నటుడు నాని స్పష్టం చేశారు.

‘ది ప్యారడైజ్’ జనం సినిమా: హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల

హైదరాబాద్‌: “నా 18 ఏళ్ల నట జీవితంలో మానసికంగా, శారీరకంగా ఎక్కువగా కష్టపడింది ‘ది ప్యారడైజ్‌’ కోసమే. ఇందులో హింస కనిపించినా, దాని వెనకున్న భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు” అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో, కయాదు లోహర్‌ కథానాయికగా, మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో … Read more

ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్

హైదరాబాద్: మాధురి రాథోడ్‌ నమోదు చేసిన బిఎన్‌ఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో ఈశ్వర్ సాయి తరఫున అడ్వొకేట్ నాగూర్ బాబు తమ వాదనలను వినిపించారు. పెళ్లయిన వ్యక్తితో ఫిర్యాదుదారు సంవత్సరాలుగా సంబంధం కొనసాగించిన విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మీడియా సింపతీ కోసమే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారని … Read more

నేడు విజయనగరం జిల్లాలోని పాఠశాలలకు సెలవు

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని డీఈఓ సూచించారు. వర్షాల కారణంగా నేడు నిర్వహించాల్సి ఉన్న కాంపెన్సేటరీ పని దినాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. పట్టు చీరపై వాసవీ అమ్మవారు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ పట్టు దారాలపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. పట్టు, రెండు గ్రాముల బంగారు జరీని ఉపయోగించి ఏడు మీటర్ల చీరపై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిరూపాన్ని ఎంతో మనోహరంగా కొలువుదీర్చారు. ఈ చీరపై అమ్మవారి చిత్రంతో పాటు 102 మంది రుషుల పేర్లు, గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలు స్పష్టంగా కనిపించేలా నేయడం విశేషం. ఈ అద్భుత రూపాన్ని తీసుకురావడానికి తనకు 45 రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్‌ … Read more

సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

కరీంనగర్: ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం లభించింది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. పురస్కార కమిటీ ఛైర్మన్, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల … Read more

గ్లోబల్ పోటీకి తగినట్లు నూతన విద్యా విధానం: సీఎం

హైదరాబాద్‌: భవిష్యత్‌ తరాల పునర్నిర్మాణం విద్యా వ్యవస్థతోనే సాధ్యమని, జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2024 సీపెక్ సర్వే ప్రకారం చదువు లేకపోవడమే సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని తేలిందన్నారు. ఎంత ఆస్తి ఉన్నా విద్యకు దూరమైతే వెనుకబడిపోతారని, అక్షరమే మానవ జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందన్నారు. ఎల్పీజీ సంస్కరణల అనంతరం విద్యావ్యవస్థలో తీవ్ర మార్పులు వచ్చాయని, అంతర్జాతీయ … Read more