‘ఇరుముడి’ నాకు గౌరవాన్నిచ్చింది: రవితేజ

సినిమా: ‘‘నటుడిగా నాకెంతో సంతృప్తిని, గౌరవాన్ని అందించిన సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్ర విజయానికి, నాకు లభించిన పేరు ప్రఖ్యాతలకు పూర్తి క్రెడిట్ దర్శకుడు శివ నిర్వాణకే చెందుతుంది’’ అని కథానాయకుడు రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి … Read more

BREAKING: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా తునిలో అలంక ఎక్స్‌ప్రెస్‌, అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌, సామర్లకోటలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అనకాపల్లిలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు … Read more

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

వివిధ డిమాండ్ల సాధనకై బ్యాంకు ఉద్యోగుల సంఘాల పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ బంద్ ప్రభావంతో పాటు శనివారం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు కావడం, సోమవారం వినాయక చవితి పండుగ ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్థిక లావాదేవీలు, చెక్కుల … Read more

పంచాయతీ నిధులు ఇక బ్యాంకు ఖాతాల్లోనే: మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నేరుగా ఈ నిధులను పంచాయతీల అభివృద్ధికే వాడుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటివరకు నిధులను ట్రెజరీలో జమ చేయడం వల్ల వాటిని డ్రా చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ కొత్త విధానంతో పంచాయతీల … Read more

కర్నూలు జిల్లాలో భూకంపం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కర్నూలు నగరం సహా ఆదోని, దాని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇళ్లలోని పాత్రలు, వస్తువులు భయంకరమైన శబ్దాలతో కదిలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు, ఖాళీ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు భూకంపశాఖ అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. భూ అంతర్భాగంలో జరిగిన చిన్నపాటి సర్దుబాట్ల … Read more

పిల్లలు లేకపోయినా పర్వాలేదనుకున్నాం: సమంత రుత్ ప్రభు

నటి సమంత రుత్ ప్రభు తన గర్భధారణ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పిల్లలు కనడంపై తాము ముందేమీ ప్రణాళికలు వేసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

ఉరవకొండ శివారులో ఘోరం.. ముగ్గురు దుర్మరణం

AP CRIME: ఓ కేసు రాజీకి సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తిరుగు ప్రయాణమైన ముగ్గురు ప్రాణస్నేహితులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ శివారు గుంతకల్లు ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసుల వివరాల ప్రకారం.. వజ్రకరూరుకు చెందిన జైనుల్లా(44), మహబూబ్‌బాషా(33), మహమ్మద్‌రఫీ(29) ఆప్తమిత్రులు. వీరు ఓ గొడవకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో రాజీ పడేందుకు ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పని ముగించుకుని బైక్‌పై … Read more

హైదరాబాద్: శాసనసభలో కోరం కరవు

TG: శాసనసభ సమావేశాలను అధికార కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అసెంబ్లీ సాగిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో మంత్రులు గానీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గానీ కనీస సంఖ్యలో కూడా కనిపించలేదు. బిఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌తో ఆ వైపు సీట్లన్నీ ఖాళీగా ఉండగా, అధికార పక్షం హాజరు కూడా నామమాత్రంగానే ఉండటంతో సభ వెలవెలబోయింది. సభ ప్రారంభమైన గంటకే మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లిపోవడంతో, సొంత … Read more

క్యాన్సర్‌కు కారణమవుతున్న పురుగుమందులు: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగు తీవ్రంగా తగ్గిపోవడం పట్ల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామాల్లో కూరగాయలు, సన్‌ఫ్లవర్‌, కందులు, పెసర పంటలు కనిపించేవని, కానీ ఇప్పుడు ఎటు చూసినా వరి సాగే కనిపిస్తోందని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించిన ఆమె, కూరగాయల రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెస్టిసైడ్స్ వాడకం రోజురోజుకూ పెరగడం వల్లే క్యాన్సర్ కేసుల … Read more

మెదక్: పోలీస్ స్టేషన్‌లో యువకుడి బలవన్మరణం

TG CRIME: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ (30) అనే యువకుడు గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఒక యువతి, ఆమె కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఈ నెల 7న అతడిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే దుర్గాప్రసాద్ ఠాణాలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. … Read more