Advertisement

హైదరాబాద్‌, విజయవాడల్లో దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

మన పత్రిక: దేశీయ మార్కెట్‌లో జూలై 27న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు, పెరిగిన ముడి చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా గోల్డ్ రేట్లలో ఈ మార్పు కనిపిస్తోంది. ఇటీవలి వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది.

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,44,920 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,840 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లోనూ ఇదే తరహా ధరలు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,070, 22 క్యారెట్ల ధర రూ.1,32,990 వద్ద విక్రయించబడుతుండగా, చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,45,080గా ఉంది.

Advertisement

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయంగా ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇవి ఉదయం 6 గంటల సమయానికి నమోదైన స్థానిక మార్కెట్ వివరాలు మాత్రమేనని, రోజంతా సాగే వ్యాపారాన్ని బట్టి మార్కెట్‌లో ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చని సమాచారం.

Advertisement