Advertisement

సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ పిటిషన్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దొడ్డ వెంకట సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరికించేందుకే సీఐడీ, సిట్ అధికారులు కుట్ర పన్ని దొడ్డ వెంకట సత్యప్రసాద్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అప్రూవర్లుగా మారుస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఆరోపించారు. అందువల్ల సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన కోరగా, ఆ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Advertisement

విచారణ సందర్భంగా పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై స్పందించిన సుప్రీంకోర్టు, భవిష్యత్తులో ఏవైనా అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే సరైన సమయంలో తగిన ఆధారాలతో కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

Advertisement