మన పత్రిక: రాష్ట్రంలో విద్యా సంస్కరణల పర్వం పూర్తయిందని, ఇకపై విద్యార్థుల ఫలితాల సాధనపైనే అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో మౌలిక వసతులు సరిగ్గా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన ఆయన, సరదా వ్యాఖ్యలు చేస్తూ “మీకు సరిగ్గా మార్కులు రాకపోతే ముఖ్యమంత్రి నా మార్కులు తగ్గిస్తారు” అని అన్నారు.
ఈ తనిఖీ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాకానుకల పంపిణీ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ పిటిషన్
- డీఎస్సీ అంశంపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి నారా లోకేశ్
- జూలై 28న స్టాక్ మార్కెట్లకు సెలవు ఉందా? NSE, BSEల స్పష్టత
- తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు ఏపీలో 49కి చేరిన బాధితులు
- తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు: ప్రభుత్వ నిర్ణయాన్ని
