Advertisement

సీఐ నాగరాజు కస్టడీపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

మన పత్రిక: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిని రాజమండ్రి జైలు ప్రాంగణంలోనే విచారించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత నాయస్థానం పక్కనబెట్టింది. దర్యాప్తు సంస్థ జైలు బయట నిందితుడిని విచారించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

విచారణ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన నిబంధనలు విధించింది. విచారణ మొత్తాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డ్ చేయాలని, నిందితుడిని ఎలాంటి హింసకు గురిచేయకూడదని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.

Advertisement
Advertisement