Advertisement

కుప్పం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసిన నారా భువనేశ్వరి

మన పత్రిక, కుప్పం: చంద్రబాబు నాయుడు మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి పరిస్థితులతో పోలిస్తే, ఇప్పటి కుప్పం నియోజకవర్గంలో ఎంతో స్పష్టమైన మార్పు వచ్చిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని పీఎంకే తాండాలో నిర్వహించిన పర్యటనలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఈ ప్రాంతంలో నీటి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రత్యేక కృషి చేశారని నారా భువనేశ్వరి తెలిపారు. కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారానే కుప్పం ప్రాంత నీటి కష్టాలు తీరాయని ఆమె వెల్లడించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

Advertisement

పరిశ్రమల స్థాపన, మహిళల సాధికారత

స్థానిక మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి మహిళ పట్టుదలతో ఏదైనా సాధించగలదని, ఉపాధి అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకోవాలని భువనేశ్వరి సూచించారు. నియోజకవర్గంలో యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కుప్పం ప్రాంతానికి రాబోయే రోజుల్లో 30 పరిశ్రమలను తీసుకువచ్చి, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

Advertisement