Advertisement

దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా డీకే శివకుమార్, చంద్రబాబుకు రెండో స్థానం

మన పత్రిక: దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు మరియు వారిపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాల ప్రకారం అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నేతలు ముందువరుసలో నిలిచారు.

ఆస్తుల పరంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

Advertisement

మరొకవైపు, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. దేశంలోనే ఏ ఇతర ముఖ్యమంత్రిపై లేని విధంగా రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 80 కేసులు నమోదై ఉన్నాయని సదరు వివరాలు తెలుపుతున్నాయి.

Advertisement