Advertisement

శక్తిశాట్‌కు ఎంపికైన ప్రభుత్వ బడి విద్యార్థిని జెస్సీకి మంత్రి లోకేశ్

మన పత్రిక: గ్లోబల్ లూనార్ మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర విద్యారంగ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ బడిలో చదువుకుంటూ ఈ స్థాయి అంతర్జాతీయ ప్రాజెక్టుకు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాల స్థాయిలో ప్రతిభ చూపి మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన జెస్సీ ఇటీవల మంత్రి లోకేశ్‌ను కలిసి తమ సాధించిన విజయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన ఘనత రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడిన మంత్రి, జెస్సీ భవిష్యత్‌లో చేపట్టే ప్రయత్నాలు, ఉన్నత చదువులకు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement