Amberpet SI : ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్

amberpet si Bhanu Prakash lost 1 crore in online betting

Amberpet SI : గత కొన్ని రోజుల నుంచి అంబర్ పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తన సర్వీస్ రివాల్వర్ కుదువ పెట్టడం, రికవరీ చేసిన బంగారాన్ని కుదవ పెట్టడం, ఇలా ఆయన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే.. ఆన్ లైన్ బెట్టింగ్ లో భానుప్రకాశ్ దాదాపు గా కోటిన్నర వరకు లాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులను అప్పుగా తెచ్చి ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు … Read more

Father Suicide : కూతురు పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య

father commits suicide over daughter marriage cancelled

Father Suicide : కూతురు పెళ్లి ఆగిపోయిందని ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తీరా పెళ్లి సమయానికి తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు చెప్పడంతో పెళ్లి ఆపోద్దంటూ పెళ్లి కూతురు తండ్రి వాళ్ల కాళ్ల మీద పడ్డా కూడా వినలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పని … Read more

Hong Kong fire : హాంకాంగ్ టవర్స్ అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం

hong kong tower fire kills 44 people

Hong Kong fire : దక్షిణ చైనాలో ఉన్న హాంకాంగ్ నగరం మొత్తం అట్టుడికిపోయింది. అతి ఎత్తైన బిల్డింగ్స్ సముదాయంలో మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్స్ అన్నీ మంటల్లో చిక్కుకుపోయి సుమారు 44 మంది అపార్ట్‌మెంట్ వాసులు సజీవ దహనం అయ్యారు. వందలాది మంది ఆచూకీ లభించడం లేదు. చైనా టైమ్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు … Read more

Gold Rates 27 Nov 2025 : 27 నవంబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

27 nov 2025 gold rates today in telugu

Gold Rates 27 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 27 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,775 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,710 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,581 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.180 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 27 Nov 2025 : 27 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

27 nov 2025 horoscope today in telugu

Horoscope 27 Nov 2025: 27 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.                                వృషభం : మనోధైర్యంతో ఉండండి. ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తవుతాయి. శుభవార్త వింటారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.                       మిథునం … Read more

భగవద్గీత పోటీల్లో చిన్నారి మోక్షిత ప్రతిభ.. రాష్ట్ర స్థాయికి ఎంపిక!

narayanpet student mokshita selected for state level bhagavad gita

మన పత్రిక, వెబ్​డెస్క్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని మోక్షిత మరాఠీ భగవద్గీత కంఠస్థంలో అద్భుత ప్రతిభ కనబరిచింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆమె విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. అశోక్ నగర్ శాఖకు చెందిన మోక్షిత, ప్రాథమిక స్థాయి (ఒకటవ తరగతి వరకు) విభాగంలో ఈ ఘనత సాధించింది. చిన్ననాటి నుంచే తమ బిడ్డకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నామని తల్లిదండ్రులు వెంకట … Read more

Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈదురుగాలులు వీచే అవకాశం

low pressure in bay of Bengal

Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా అల్పపీడనం ప్రారంభమై.. అది వాయువ్య దిశగా కదులుతోంది. గురువారం లోపు అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇదే అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరి వైపు కదిలి మరింత బలపడే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 55 కిమీల వేగంతో … Read more

Samantha : ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేయనున్న హీరోయిన్ సమంత

Samantha joins with united nations against online harassment

Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది. ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా … Read more

AP CM Chandrababu : ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

ap cm Chandrababu comments about politics

AP CM Chandrababu : తాను ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. స్టూడెంట్ గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో. నేను గాని రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. అది నా విజన్.. అంటూ ఓ వేదిక మీద సీఎం … Read more

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

Naveen Yadav took oath as jubilee hills mla

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వి.నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరిగాయి.