Advertisement

సెప్టెంబర్ 11న ‘జీ5’లో అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీల ‘ఘమాసాన్’ మూవీ

మన పత్రిక: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ఘమాసాన్’ నేరుగా ఓటీటీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026 నుంచి ‘జీ5’ (ZEE5) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు.

బుందేల్‌ఖండ్ అటవీ ప్రాంత నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించారు. ఈ కథలో ప్రతీక్ గాంధీ శక్తివంతమైన ఐపీఎస్ అధికారి ఆదిత్య పాత్రలో నటించగా, అర్షద్ వార్సీ మోస్ట్ వాంటెడ్ డకాయిట్ మహారాజ్ పాత్రను పోషించారు. అధికారం, రాజకీయాలు, పగ నేపథ్యంగా సాగే వ్యవస్థలో ఈ ఇద్దరి మధ్య నడిచే ఘర్షణను సినిమాలో చూపించనున్నారు.

Advertisement

‘ఘమాసాన్’ చిత్రాన్ని జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. జ్యోతి దేశ్‌పాండే, పియూష్ సింగ్, అభయానంద్ సింగ్, సౌరభ్ గుప్తా, అశ్విని చౌదరి, మిటెన్ షాలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పటికే మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, సినీవెంచర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శితమైంది.

Advertisement