Advertisement

రామాయణం తెలుగు హక్కులపై దిల్ రాజు దృష్టి

మన పత్రిక: ‘కెజీఎఫ్’ చిత్రాల విజయంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం తెలుగు హక్కుల కొనుగోలుకు సంబంధించి ఆయన చర్చలు జరుపుతున్నట్లు వినోద పరిశ్రమ వర్గాల సమాచారం.

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే, తొలుత ఈ చిత్ర హక్కుల వ్యాపారం రూ.108 కోట్లకు ప్రతిపాదించగా, ఆ తర్వాత రూ.80 కోట్లకు కుదిరినట్లు తెలుస్తోంది. చివరకు రూ.75 కోట్ల రిటర్నబుల్ ప్రాతిపదికన ఈ ఒప్పందం ముగిసినట్లు సమాచారం. ఈ తరహా ఒప్పందం వల్ల పంపిణీదారులకు ఆర్థిక రిస్క్ తగ్గుతుందని చిత్రసీమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

ఇదే బాటలో ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం రూ.105 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా చిత్రాలకు తెలుగు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దిల్ రాజు ఈ రకమైన పెద్ద ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, రామాయణం హక్కులకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement