Advertisement

సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న?

మన పత్రిక: భారత రత్న, ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో కథానాయికగా రష్మిక మందన్న నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నప్పటికీ, ఇతర సినిమాల కాల్షీట్ల సమస్యల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రుక్మిణి వసంత్ పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆఖరికి రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానం, ఆమె వ్యక్తిత్వం, గౌరవాన్ని వెండితెరపై ఆవిష్కరించడం రష్మిక కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యమున్న ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేష్, అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 16న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే రోజున ఈ సినిమా శీర్షిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు వెల్లడించనున్నారని భావిస్తున్నారు.

Advertisement