రాజకీయాల్లోకి మహిళలను లాగడం సరికాదు: నారా భువనేశ్వరి

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వివాదాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు.

ఓటర్ల నమోదులో బిఎల్ఏల పాత్రపై తెలంగాణ కాంగ్రెస్ ప్రశంసలు

ఓటర్ల సవరణ కార్యక్రమంలో పార్టీ బిఎల్ఏలు అందిస్తున్న సేవలను తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ అభినందించింది. న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

నల్లమలలో పులుల సంరక్షణకు చర్యలు పెంచుతాం: పవన్ కల్యాణ్

నల్లమల అటవీ ప్రాంతంలో పులుల ఉనికిని శాశ్వతం చేసేలా ఏపీని పులుల సంరక్షణలో ఆదర్శంగా నిలుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మంత్రి లోకేశ్‌ను విమర్శించే అర్హత కాకాణికి లేదు: సోమిరెడ్డి ఫైర్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై విచారణ జరపాలని నెల్లూరు జిల్లా మనుబోలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన కెటిఆర్

కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టి, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

లోకేశ్ రాజీనామా చేయాలి: మాజీ మంత్రి రోజా డిమాండ్

డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి రోజా తిరుపతిలో నిరసన తెలిపారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కుప్పంలో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌తో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.