మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravati క్వాంటం పరిశోధనలకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని, దానిని ప్రధాన క్వాంటం హబ్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో క్వాంటినమ్ సంస్థ సీఈఓతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో అమరావతిని క్వాంటం పరిశోధనల కేంద్రంగా మార్చడంపై కీలక చర్చలు నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు క్వాంటినమ్ సంస్థ ఆసక్తి చూపించింది. అంతేకాకుండా క్వాంటం పరికరాల ఉత్పత్తి ప్రక్రియలో పూర్తి సహకారం అందిస్తామని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- సత్తుపల్లిలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పిడి చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
- తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి
- ఆటోమేటిక్ ఇన్సెంటివ్ వ్యవస్థపై మంత్రుల బృందం తొలి సమావేశం నిర్వహించిన నారా లోకేశ్
- రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
