Advertisement

చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమనా కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

మన పత్రిక: తిరుపతిలో 16 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు Bhumana Karunakar Reddy తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాననే పగతోనే ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి విధ్వంసాలకు భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భూమనా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సదరు భూమిని తాను 21 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశానని చెప్పారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కానీ, అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇవి ఆక్రమణలుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ అవినీతికి, మోసాలకు పాల్పడలేదని, తిరుపతిలో రౌడీ రాజకీయాలు లేకుండా విలువలతో కూడిన రాజకీయం చేశానని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులను ఎంత ధ్వంసం చేసినా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటానని, 1991లో ప్రారంభించిన హెరిటేజ్ సంస్థ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement