Advertisement

కాంగ్రెస్ నిరసనలపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి తీవ్ర విమర్శలు

మన పత్రిక: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య Gitanjali Angmo విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేయడం కంటే జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసి మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.

ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనలు కేవలం ప్రజలను మోసగించడానికేనని గీతాంజలి పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడితే యువత తరిమికొడుతుందని హెచ్చరించారు. ఈ విద్యార్థి ఉద్యమం పూర్తిగా రాజకీయాలకు అతీతమైనదని ఆమె స్పష్టం చేశారు. నాయకులకు మాటలు కాకుండా చేతలు కావాలని, విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తూ పార్లమెంట్ వేదికగా పరిష్కారం చూపాలని కోరారు. స్వార్థ రాజకీయాల కోసం ఈ ఉద్యమాన్ని వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతుండగా, సోనమ్ వాంగ్‌చుక్ ఆసుపత్రిలోనే తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సోమవారం నాటి ‘పార్లమెంట్ మార్చ్’ సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగి లాఠీఛార్జ్‌కు దారితీసింది. పోలీసుల చర్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మరియు ఇతర నాయకులు ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నా చేపట్టారు.

Advertisement