మన పత్రిక: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన AP Cabinet సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మికులకు సాయం అందించే ‘నేతన్న భరోసా’ పథకానికి మంత్రిమండలి అధికారికంగా ఆమోదం తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేబినెట్ ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అలాగే నేరడి బ్యారేజ్ నిర్మాణ పనుల కోసం రూ. 641 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. వీటితో పాటు రాబోయే పుష్కరాల నిర్వహణ, భద్రతా బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ. 50 కోట్లు విడుదల చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
