TG: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు కోటి మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత సదుపాయాన్ని చూసి ఓర్వలేక కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ … Read more

కొండా సురేఖ చేరిక ప్రచారంపై మురళీధర్ రావు ఘాటు వ్యాఖ్యలు

మాజీ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరుతారనే వార్తలపై సీనియర్ నేత పి. మురళీధర్ రావు స్పందిస్తూ, ఇతర పార్టీల నుంచి బహిష్కృతులైన వారిని చేర్చుకునేందుకు బీజేపీ డంపింగ్ బిన్ కాదని వ్యాఖ్యానించారు.

Teachers Day 2026: ఎ. మదన్ లాల్‌కు Best Teacher Award

ajmera madanlal

మన పత్రిక, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం–2026 సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎ. మదన్ లాల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఎ. మదన్ లాల్ ప్రస్తుతం కోనరావుపేట మండలంలోని ప్రాథమిక పాఠశాల, కోనరావుపేటలో ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయనను జిల్లా స్థాయి ఉత్తమ … Read more

కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్ రావు ఆరోపించారు. ఎల్బీనగర్‌లోని హస్తినాపురంలో జరిగిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Smart Ration Cards Telangana: 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

హైదరాబాద్: తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొత్త కార్డులను ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు సంబంధిత వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ప్రతి నెలా 6 కిలోల సన్న బియ్యం పేదలకు ప్రతి నెలా … Read more

Police Jobs Age Limit: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు మరో 2 ఏళ్ల వయో సడలింపు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Police Jobs) కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. పోలీస్ శాఖతో పాటు పలు యూనిఫాం సర్వీసుల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 14న జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదనపు సడలింపు పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, … Read more

Telangana Weather: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, ఉరుములు.. IMD అలర్ట్

మన పత్రిక: తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఆగస్టు 14న ఈ పరిస్థితులు కనిపించే అవకాశం ఉండగా, ఆగస్టు 15, 16 తేదీల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేసింది. ప్రాంతాన్ని … Read more

Hyderabad Double Decker Flyover: హైదరాబాద్‌లో కొత్త ప్రతిపాదన

హైదరాబాద్ చందానగర్ గంగారం డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదన

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా రోడ్డు, మెట్రో రవాణాను ఒకే కారిడార్‌లో అనుసంధానించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిపై చందానగర్–గంగారం ప్రాంతంలో డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత నిర్మాణంలో కింది స్థాయిలో వాహనాల రాకపోకలకు ఫ్లైఓవర్, దాని పైన మెట్రో వయాడక్ట్ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. ఈ మార్గాన్ని మియాపూర్–పటాన్‌చెరు మెట్రో విస్తరణతో అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకే కారిడార్‌లో రెండు రవాణా వ్యవస్థలను … Read more

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు

తెలంగాణలో కొత్త చేూత పెన్షన్లు మరియు పీవీసీ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కొత్త చేూత పెన్షన్లతో పాటు కొత్త పీవీసీ రేషన్ కార్డుల (PVC Ration Cards) పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కొత్తగా లబ్ధి పొందనున్న కుటుంబాలు, పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఊరట కలగనుంది. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి చేూత పథకం కింద కొత్తగా సుమారు 2 నుంచి 3 లక్షల పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం … Read more

ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ఐక్య పోరాటం చేయాలి: కలవల శంకర్

తెలంగాణ ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాటం

తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ముగ్గురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, 8 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల, 40 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు విజ్ఞప్తి. విషయం: ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించి, జీవో నెం.25ను సవరించేందుకు ఐక్యంగా కృషి చేయాలని విజ్ఞప్తి. విద్యావ్యవస్థకు ప్రాథమిక పాఠశాలలు పట్టుకొమ్మలైతే, ఉపాధ్యాయ సంఘాలకు SGTలు,PSHM లు పట్టుకొమ్మలు.. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో జులై 31,2026 వరకు 1,03,550 మంది ఉపాధ్యాయులు పని చేయుచుండగా, అందులో … Read more