మన పత్రిక, సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు Bhatti Vikramarka తన సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సింగరేణి సంస్థకు చెందిన జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్దకు చేరుకున్నారు. గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉప ముఖ్యమంత్రికి పూలగుత్తులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై వారు స్వల్ప సమయం చర్చించారు.
స్వాగత కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా జేవీఆర్ ఓసీ-II గని లోపలికి వెళ్లి బొగ్గు తవ్వకాల తీరును స్వయంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా ప్రాసెస్ మరియు ఓవర్ బర్డెన్ పనుల వేగంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డైరెక్టర్ గౌతమ్ పోట్రు తదితరులు ఉప ముఖ్యమంత్రికి గని పనితీరును వివరించారు. సంస్థ ప్రగతితో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి, రక్షణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- చెన్నై థియేటర్ వద్ద నటి త్రిషను చుట్టుముట్టిన అభిమానులు
- భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రుల బృందం
- వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- పిడి చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
- తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి
