మన పత్రిక, సుల్తాన్పూర్: భవిష్యత్ ఐటీ ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని నిపుణులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని JNTUH Sultanpur యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో శిక్షణ, ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో గురువారం “స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ ఐటీ వర్క్ఫోర్స్” అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఈసీఈ, సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ & ఎంఎల్) విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ఫుల్ స్టాక్ విత్ ఏఐ ట్రైనర్ రాజ్‌కుమార్, జావా బ్యాకెండ్ డెవలపర్ వివేక్, ఏఐ ఇంజినీర్ నిఖిల్, వీఎల్ఎస్ఐ ఇంజినీర్ కిరణ్ పాల్గొని మాట్లాడారు. ఐటీ రంగంలో వేగంగా వస్తున్న మార్పులు, కృత్రిమ మేధస్సు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా, వీఎల్ఎస్ఐ తదితర విభాగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వీటితో పాటు ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టులు, కోడింగ్ పోటీలు, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ కోర్సులలో పాల్గొనాలని కోరారు.
పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సాంకేతిక నైపుణ్యాలను పెంచుకుంటే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ రాజు తెలిపారు. పరిశ్రమ ఆధారిత శిక్షణ, ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం ఉద్యోగాలు సాధించడంలో ముఖ్యాంశాలని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎం. శైలజ పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో విద్యార్థులు కెరీర్ ప్రణాళిక, ఉన్నత విద్య, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ సన్నద్ధతపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- అమరావతిలో పీఎన్బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
- తెనాలిలో డ్రైవింగ్ టెస్టు సందర్భంగా కారు ప్రమాదం: నలుగురికి గాయాలు
- తిరుమల అలిపిరి మార్గంలో సినిమా ఫ్లెక్సీ ప్రదర్శన పై భక్తుల ఆగ్రహం
- భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
