Advertisement

ప్రధాని మోదీ పేరు చెప్పేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారు: కేటీఆర్

మన పత్రిక: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ధైర్యంగా ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి PM Modi పేరు చెప్పేందుకే భయపడుతున్నారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పాత కేసుల భయం వల్లే కేంద్ర పెద్దల ముందు సీఎం నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ అరెస్టు వ్యవహారానికి నిరసనగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ముందు ధర్నా చేయకుండా, కొడంగల్‌లో నిరసన చేపట్టడం రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అమృత్ (AMRUT) పథకం పనులు, ఇతర కాంట్రాక్టుల విషయంలో రేవంత్ రెడ్డి రాజీపడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో సొంత లబ్ధి చూసుకుంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి, బీజేపీకి నిధులు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం కాకుండా పాత కేసుల నుంచి రక్షణ కోసమే రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement