బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టు

TELANGANA POLITICS: సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకాపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి, వీరిద్దరిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులకు, … Read more

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

TELANGANA POLITICS: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరానికి చేరుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి. … Read more

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా: MLC తాతా మధు

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం ముప్పేట దాడిలా మారుతుండటంతో తాతా మధు స్పందించాల్సి వచ్చింది. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను స్పీకర్‌ను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అనలేదని, … Read more

తెలంగాణలో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. ఓటర్ల నమోదు, క్లెయిమ్‌లు అలాగే అభ్యంతరాల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సవరించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను నవంబర్ 5 లోపు పూర్తి చేయనున్నారు. అన్ని ప్రక్రియలు … Read more

HYD: అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో … Read more

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల ప్రారంభం వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనగా నల్ల టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు, కేపీ వివేకానంద్‌ టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి స్పృహతప్పి పడిపోగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తనతో అమానుష్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. … Read more

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి … Read more

అమ్మను బలి చేస్తారనుకోలేదు: కొండా సుస్మిత ఆవేదన

తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఆదిలాబాద్‌లో విద్యార్థి సూసైడ్

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంతో అనే అభ్యర్థి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టిఫిన్ చేద్దామని స్నేహితులు పిలిచారు. తర్వాత వస్తానని చెప్పి అనంతరం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా ఆయన ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. కుటుంబ కారణాల వల్లే స్వామిరామం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు … Read more

రేపటి నుంచే తెలంగాణ శాసనసభ సభలు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. భద్రతా దృష్ట్యా పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సభల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరగా, అన్ని రకాల ప్రభుత్వ సమాచారాన్ని త్వరితగతిన అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విడత సమావేశాల్లో ప్రధానంగా యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు 21 ఏళ్లకే పోటీ … Read more