BIG BREAKING: KTR, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న తమపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో BRS ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 7న అసెంబ్లీ వద్ద ప్రొటోకాల్/పరిస్థితుల నిర్వహణలో భాగంగా విధుల్లో ఉండగా తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ … Read more

ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లోనే సీసీ టీవీలు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నామని మంత్రి సభలో పునరుద్ఘాటించారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాలు, … Read more

TG: కానిస్టేబుల్ వయోపరిమితి మరో 3 ఏళ్లు సడలింపు

హైదరాబాద్: పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర శాఖల్లోని కానిస్టేబుల్, తత్సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు సడలించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖలో సబ్ ఇన్స్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల వయోపరిమితిలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన 7 … Read more

మాజీమంత్రి జోగి రమేష్‌పై గవర్నర్‌కు కోడలి ఫిర్యాదు

హైదరాబాద్: YCP మాజీమంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన కోడలు మేఘన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి ఆమె గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. తన పెళ్లికి తల్లిదండ్రులు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, అయితే కొన్నాళ్లకే అత్త శకుంతల, మామ జోగి రమేష్, భర్త రాజీవ్ రూ.5 కోట్ల అదనపు కట్నంతో పాటు ఖరీదైన … Read more

డాన్ దర్శకుడితో నాని కొత్త సినిమా

సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘డాన్’ సినిమాతో గుర్తింపు పొందిన తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తన నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ … Read more

POLITICS: సెషన్ మొత్తానికి BRS సభ్యుల సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మూడో రోజూ తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి అంశాలపై చర్చించాలని కోరుతూ భారాస సమర్పించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో రగడ మొదలైంది. BRS సభ్యులు ‘వి వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారి తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడుతూ.. “దేనికి జస్టిస్ కావాలి? మీ హయాంలో అన్యాయానికి గురైన దళితులకా?” అని ప్రశ్నించారు. సభా కార్యక్రమాలకు … Read more

ఖమ్మం గురుకులంలో దారుణం.. విద్యార్థి మృతి

TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆటలాడుతూ 8వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు సలిగంటి సాత్విక్‌ (14) రఘునాథపాలెం గురుకులంలో చదువుతున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు లేచి తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో రన్నింగ్ చేశాడు. పరుగు పూర్తి చేసి వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. వెంటనే … Read more

ఏటా 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం: హోంమంత్రి అనిత

అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకూ లోనై ఆందోళనలకు దిగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల … Read more

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఇకపై సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు … Read more

బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులతో … Read more