Advertisement

డాన్ దర్శకుడితో నాని కొత్త సినిమా

సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘డాన్’ సినిమాతో గుర్తింపు పొందిన తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తన నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. నాని, సిబి చక్రవర్తి కాంబినేషన్‌పై ఇటు అభిమానుల్లో, అటు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

Advertisement