Advertisement

BIG BREAKING: KTR, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న తమపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో BRS ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ నెల 7న అసెంబ్లీ వద్ద ప్రొటోకాల్/పరిస్థితుల నిర్వహణలో భాగంగా విధుల్లో ఉండగా తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా BRS నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిలతో పాటు మరికొందరిపై వివిధ బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, విధుల నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, ఆటంకం కలిగించడం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement