Advertisement

TG: కానిస్టేబుల్ వయోపరిమితి మరో 3 ఏళ్లు సడలింపు

హైదరాబాద్: పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర శాఖల్లోని కానిస్టేబుల్, తత్సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు సడలించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖలో సబ్ ఇన్స్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల వయోపరిమితిలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన 7 ఏళ్ల సడలింపునకు అదనంగా ఈ మూడేళ్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ పెంపు వర్తించదు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చేపడుతున్న నియామకాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయని, త్వరలోనే రాష్ట్ర గెజిట్‌లో ప్రచురిస్తామని తెలిపింది.

Advertisement