Advertisement

బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గులాబీ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పీఎస్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Advertisement