డాన్ దర్శకుడితో నాని కొత్త సినిమా

సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘డాన్’ సినిమాతో గుర్తింపు పొందిన తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తన నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ … Read more

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములు, … Read more

పెళ్లయినంత మాత్రాన మహిళల స్వేచ్ఛ అంతం కాదు: సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: వైవాహిక అత్యాచారాన్ని (Marital Rape) నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి అయినంత మాత్రాన మహిళల వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ అంతం కాకూడదని అత్యున్నత త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. భార్య అంగీకారం లేకుండా భర్త లైంగిక సంబంధం కలిగి ఉండే చర్యను మినహాయింపుగా మారుస్తున్న చట్ట నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ విచారణ కొనసాగుతోంది. భారత ప్రధాన జస్టిస్‌ (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, … Read more

సూర్య ‘సీన్’ టైటిల్ ఖరారు.. పవర్ ఫుల్ టీజర్ రిలీజ్

సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘Suriya 47’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి ‘సీన్‌ (Scene)’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన పవర్‌ఫుల్ టైటిల్ టీజర్, … Read more

స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించడం, ఎర్రవల్లిలో దళితులు నడిచారనే నెపంతో రోడ్డును శుద్ధి చేసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్‌ 6 నుంచి జరిగిన ఈ వరుస పరిణామాలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చని, కానీ దళిత స్పీకర్‌ను ఘోరమైన పదాలతో దూషించి తల్లిని అవమానించేలా ప్రవర్తించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వివక్షను, అణచివేతను తమ ప్రభుత్వం … Read more

8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో రైలు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. పలు రైల్వే కారిడార్లలో నాలుగు లైన్ల నిర్మాణం కోసం 8 మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. మొత్తం ప్రాజెక్టుల్లో దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ 5 ప్రాజెక్టులకు, ఉత్తరాదిలో 3 ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో … Read more

తిరుపతి: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీ ప్రత్యేక బీమా

తిరుమల: శ్రీవారి భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పెద్దపీట వేసింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఐసీ ద్వారా భక్తులకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా, సహజ మరణానికి సైతం రూ.2 లక్షలు అందజేసేలా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం … Read more

మళ్లీ ప్రజల్లోకి జగన్‌.. 2027లో పాదయాత్రకు సన్నాహాలు

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రజా యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్రపై ఆయన తాజాగా స్పష్టతనిచ్చారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో పాదయాత్ర 2.0పై స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని ఆయన పేర్కొన్నారు. 2029లో ఏపీలో … Read more

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. దాదాపు 22 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఈ వర్షాకాల సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ బుధవారం ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, నినాదాలతో సభను స్తంభింపజేసే ప్రయత్నం … Read more

స్థానిక పోరుపై సీఎం చంద్రబాబు డ్రామాలు: వైఎస్ జగన్‌

అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ చంద్రబాబు మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టులో వీగిపోయే అంశాలపై ముందుకెళ్తూ, ఆ సాకుతోనే … Read more