Advertisement

ఏటా 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం: హోంమంత్రి అనిత

అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకూ లోనై ఆందోళనలకు దిగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల పోలీసు పోస్టులను గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 6 వేల పోస్టుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.12 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం 9,793 పోలీసు పోస్టులను భర్తీ చేసిందని గుర్తుచేశారు.

Advertisement
Advertisement