బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టు

TELANGANA POLITICS: సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకాపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి, వీరిద్దరిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులకు, … Read more

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

TELANGANA POLITICS: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరానికి చేరుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి. … Read more

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల ప్రారంభం వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనగా నల్ల టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు, కేపీ వివేకానంద్‌ టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి స్పృహతప్పి పడిపోగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తనతో అమానుష్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. … Read more

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి … Read more

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

మన పత్రిక: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా యుద్ధ భయాలు, ఆర్థిక ఒత్తిళ్లు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతేకాకుండా అమెరికన్ డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభం కావడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,90,000 వరకు ట్రేడ్ … Read more

సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం నేటి (శనివారం, మార్చి 7, 2026) రాశి ఫలాలు మీ కోసం. నేటి గ్రహస్థితులు, నక్షత్ర సంచారం (ఉదయం 11:12 వరకు చిత్తా, ఆ తర్వాత స్వాతి) ఆధారంగా ద్వాదశ రాశుల (12 రాశులు) వారి దైనందిన జీవితం ఎలా ఉండబోతోంది? ఎవరికి వ్యాపార లాభాలు, ఎవరికి ఉద్యోగంలో ఒత్తిడి, ఏ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే పూర్తి … Read more

ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో జరుగుతున్న యుద్ధం సెగ మన సామాన్యుడి వంటింటికి చేరింది. అక్కడ రవాణా నిలిచిపోవడంతో.. మన దేశ ఆర్థిక వ్యవస్థపై, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడబోతోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు, అరటిపండ్లు, ఉల్లి, కూరగాయల షిప్‌లు నిలిచిపోవడంతో.. స్థానికంగా సరఫరా పెరిగి తాత్కాలికంగా వాటి ధరలు పడిపోనున్నాయి. ఉదాహరణకు ₹7 ఉన్న గుడ్డు రేటు ₹5 కి రానుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపే! … Read more

Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!

Nalgonda rain news

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకొండ కోమ్మెపల్లిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, సిబ్బంది పాఠశాలకు చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప … Read more

మోదీ కర్నూలు చేరుకున్నారు – శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రిప్

modi visit andhra pradesh

Modi visit andhra pradesh: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం తెలిపారు. ప్రధాని ఓర్వకల్లు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో … Read more