Advertisement

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో వారం రోజుల పాటు పొడిగించారు.

అభ్యర్థులు ఇకపై సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్సై, కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ తదితర పోస్టులకు ఇంటర్‌, డిగ్రీ, పదో తరగతి అర్హతలతో పాటు ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Advertisement
Advertisement