NIABలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది. ఆగస్టు 14 దరఖాస్తుకు చివరి తేదీ.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది. ఆగస్టు 14 దరఖాస్తుకు చివరి తేదీ.
కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ సంస్థ తన ప్లాంట్ విస్తరణ పనులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఉన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు రైతులకు ప్రాణం పోస్తోందని తెలిపారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి చెందారు. ఆయన మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కుమారస్వామితో ఆయన భేటీ కానున్నారు.
తిరుపతి కేశవాయనగుంటలో ఒంటరిగా ఉంటున్న జ్యోతి అనే వృద్ధురాలిని దుండగులు గొంతు కోసి చంపారు. ఇంట్లో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడాకుల కక్షతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీలో ఏడవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.