Advertisement

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, 25కు పైగా కీలక అంశాలపై చర్చ

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశంలో సుమారు 25కు పైగా కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలకు ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో ప్రధానంగా రెండో దశ కింద 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే నేతన్న భరోసా పథకం ద్వారా ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం అందించే అంశంపై చర్చించనున్నారు. వీరితో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం, అగ్నిమాపక శాఖ అవసరాల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisement
Advertisement