Advertisement

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు స్పందన

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో Delhi Metro స్టేషన్ల మూసివేత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు స్పందించింది. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనల వల్ల భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వరుసగా రెండో రోజు 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మెట్రో స్టేషన్లను మూసివేయడం వల్ల న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది సమయానికి న్యాయస్థానానికి చేరుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను కోరింది. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన తర్వాత కూడా రవాణా సమస్యలు తీరకపోతే సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement