మన పత్రిక, చండూరు: విద్యుత్ షాక్ (Electric Shock) తగలడంతో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, చండూరు మున్సిపాలిటీ 3వ వార్డు లకినేనిగూడెంకు చెందిన షేక్ సయ్యద్ (38) బోరుబావుల మోటర్లను తీసే మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామికి చెందిన బోరు మోటర్ రిపేరు కోసం తీసుకెళ్లిన సమయంలో ఆయన ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను 108 అంబులెన్స్ ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో లకినేనిగూడెం, పుల్లెంల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- అమరావతిపై జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
- హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
- భారత్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు: నేటి తాజా రేట్లు ఇలా ఉన్నాయి
- సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సుమంత్ మహేంద్రగిరి వారాహి
- తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
