మన పత్రిక, పర్వతగిరి: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పర్వతగిరి మండల Youth Congress President గొడుగు వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంలో బాధితురాలిని దూషించి బెదిరించారనే ఆరోపణలతో వినయ్ బావ భాషబోయిన వీరస్వామిపై కూడా కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
గుండా మానస అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ప్రకారమే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశారని, ఈ విషయమై నిలదీయగా వినయ్ తో పాటు అతని బావ వీరస్వామి ఫోన్ లోనూ, ప్రత్యక్షంగానూ తనను దూషిస్తూ బెదిరించారని బాధితురాలు పేర్కొంది. తన కుటుంబ సభ్యులను కూడా అవమానించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఘటనపై విచారణ వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- ఏపీ అస్త్రం యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని పవన్ కల్యాణ్ ఆదేశం
- భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు దుర్మరణం
- సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు
- పెర్కిట్లో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
