HNK: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి!

మన పత్రిక, క్రైం: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఐనవోలు మండలం ఫున్నేలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ అజహరుద్దీన్ తన భార్య ఫర్హత్‌(26), కూతుళ్లు ఉమేరా(8), ఆయేషా(7)తో కలిసి బుధవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. కొంతసేపు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీటిలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. పిల్లలకు ఈత రాక మునిగిపోతుండగా వారిని రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు … Read more

మహబూబ్‌నగర్: జబర్దస్త్‌ కొమురక్కపై దాడి

మన పత్రిక: జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై అభిమానులమని నమ్మించి ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్‌ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నానని అంగీకరించి తిరిగి ఇస్తానని … Read more

‘రణబలి’ సినిమా షూటింగ్ వీడియో లీక్

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, T-సీరిస్ సమర్పిస్తోంది. ఇటీవలే విజయ్, రష్మిక పెళ్లి వార్తలతో ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమాలో వీరు పోషిస్తున్న రణబలి, జయమ్మ పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా … Read more

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

మన పత్రిక, వాతావరణం: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వేడిగాలుల మధ్య ఉపశమనం కలిగించేలా వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, … Read more

అర్ధరాత్రి ఇండోనేషియాలో భూకంపం

మన పత్రిక: ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు రేకెత్తించింది. రిక్టర్ స్కేలుపై 6.1 నుంచి 6.8 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తూర్పు ఇండోనేషియాలోని తెర్నేట్ సమీప సముద్ర గర్భంలో కేంద్రీకృతమయ్యాయి. భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ BMKG తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మలేషియా, ఫిలిప్పీన్స్ … Read more

ఆర్టెమిస్ -2 ప్రయోగం విజయవంతం

మన పత్రిక: అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపట్టిన ప్రతిష్టాత్మక Artemis II మిషన్ ఫ్లోరిడాలోని Kennedy Space Center నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1972లో జరిగిన Apollo 17 తర్వాత సుమారు 54 ఏళ్ల విరామం అనంతరం మానవులను చంద్రుడి దరిచేర్చే తొలి క్రూడ్ మిషన్‌గా ఇది చరిత్రలో నిలిచింది.నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన Space Launch System (ఎస్‌ఎల్‌ఎస్‌) రాకెట్ సహాయంతో Orion క్యాప్సూల్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమైందని, వ్యోమగాములు … Read more

AP: లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

మన పత్రిక, రాజకీయం: అమరావతి పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. మార్చి 28న కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా … Read more

BREAKING: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి

మన పత్రిక, తెలంగాణా: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చినప్పటి దయనీయ ఘటనగా ఇది జరిగింది. భక్తులు తెలిపారు, ఏర్పాట్లు సక్రమంగా లేనందున ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స అందించారు. స్థానికులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఏర్పాట్లలో జాగ్రత్త తీసుకోవాలని అధికారులు … Read more

నారాయణపేట జిల్లాలో దారుణం.. ఐదేళ్ల పాప హత్య

మన పత్రిక, క్రైం, TG: నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాపను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి చెరువు కట్టపై పడవేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంజప్ప, శిరీష దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరికి తేజశ్రీ (5) అనే కూతురు, ఒక చిన్న కుమారుడు ఉన్నారు. కుమారుడు చిన్నవాడిగా ఉండటంతో తమ వెంట తీసుకెళ్లగా, తేజశ్రీని … Read more

ఆర్మీ కొలువులకు మరో 10 రోజులు ఛాన్స్!

మన పత్రిక, జాబ్స్: భారత సైన్యంలో చేరాలని ఆశించే యువతకు శుభవార్త. 2027 రిక్రూట్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. ఇప్పటికే అప్లై చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.inలో తమ వయస్సు, విద్యార్హతలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా జరుగుతుందని స్పష్టం చేశారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. … Read more