మన పత్రిక: అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపట్టిన ప్రతిష్టాత్మక Artemis II మిషన్ ఫ్లోరిడాలోని Kennedy Space Center నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1972లో జరిగిన Apollo 17 తర్వాత సుమారు 54 ఏళ్ల విరామం అనంతరం మానవులను చంద్రుడి దరిచేర్చే తొలి క్రూడ్ మిషన్‌గా ఇది చరిత్రలో నిలిచింది.నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన Space Launch System (ఎస్ఎల్ఎస్) రాకెట్ సహాయంతో Orion క్యాప్సూల్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమైందని, వ్యోమగాములు క్షేమంగా ఉన్నారని నాసా అధికారికంగా వెల్లడించింది.
ఈ చారిత్రాత్మక యాత్రలో కమాండర్ Reid Wiseman నేతృత్వంలో పైలట్ Victor Glover, మిషన్ స్పెషలిస్ట్ Christina Koch, కెనడాకు చెందిన Jeremy Hansen పాల్గొన్నారు. వీరి ప్రధాన లక్ష్యం చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా చేరుకుని జాబిల్లిని చుట్టి తిరిగి భూమికి చేరుకోవడం. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ మిషన్‌లో ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని లైఫ్ సపోర్ట్, కమ్యూనికేషన్ తదితర కీలక వ్యవస్థలను అంతరిక్షంలో పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ నివాసాలకు మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
